31-08-2025 05:20:08 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): ఎక్సలెంట్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 7వ తేదీన వికాస తరంగిణి ఆధ్వర్యంలో అండర్-15 జూనియర్స్ చదరంగం పోటీలు మంచిర్యాల డిస్ట్రిక్ట్ జెట్ భవనంలో నిర్వహిస్తున్నట్లు ఎక్సలెంట్ చెస్ అకాడమీ డైరెక్టర్ భూపతి మహేష్ తెలిపారు. 15 సంవత్సరాలలోపు బాలబాలికలు ఎవరైనా పోటీలలో పాల్గొనవచ్చునని, మొదటి 10 స్థానాలకు నగదు బహుమతితో పాటు ట్రోఫీ అందజేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఏజ్ గ్రూప్ కి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఉంటాయనీ, ఈ టోర్నమెంట్ లో పాల్గొనే వారు సెప్టెంబర్ 5 లోపు పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 94915 32651లో సంప్రదించవచ్చన్నారు.