31-08-2025 08:19:26 PM
సదాశివనగర్,(విజయక్రాంతి): అకాల వర్షానికి నష్ట పోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆడుకోవాలని మాజీ ఎమ్మెల్యే జజాల సురేందర్ అన్నారు. ఆదివారం మండలంలోని వజ్జేపల్లి తాండా, యాచారం, సజ్యనాయక్ తండా, పూర్య నాయక్ తండాలలో పర్యటించి వరద బీభత్సానికి కుంటల అలుగులు తెగి గిరిజన రైతుల పంట పొలాలలో మట్టి, ఇసుక కుప్పలు కుప్పలుగా పేరుక పోయి తీవ్ర నష్టం జరిగిన ప్రాంతాలలో పర్యటించారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గం వర్షానికి చాలా పంటలు నష్ట పోయి నట్టు, పంట నష్ట పోయిన వారికి ఎకరానికి లక్ష, ఇల్లు కూలిన వారికి ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.గ్రామాల పర్యటనలో విపత్తు వలన నష్టపోయిన బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు.అయన వెంట బిఆరెస్ నాయకులు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.