18-08-2025 02:04:26 AM
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
జగిత్యాల అర్బన్, ఆగస్టు 17(విజయ క్రాంతి): గణేష్ మండప నిర్వాహకులు పోలీసు వారు రూపొందించిన ఆన్లైన్ పోర్టర్ లో గణేష్ మండలి పేర్లు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. గణేష్ మండపం నిర్వహణకు సంబంధించిన ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం మండపం నిర్వహణ, మండపం నకు సంబంధించిన సమాచారం కొరకు మాత్రమే రూపొందించిందని,
సమాచారం ద్వారా భద్రత, బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసులకు సులువుగా ఉంటుందని , ఆన్ లైన్ ఇన్ఫర్మేషన్ కు ఎటువంటి రుసుము లేదని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.గణేష్ ఉత్సవాల నిర్వాహకులు గణేష్ విగ్రహాలను వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేయుటకు ముందస్తు సమాచారం పోలీసుస్టేషన్ లో ఇవ్వాలని అందుకోసం ఏదైనా కంప్యూటర్, మొబైల్ నందు అప్లై చేసుకోవాలన్నారు.
దీనికోసం http://policeportal. tspolice.gov.in అనే site లో వివరాలు పొందు పరచి అప్లికేషన్ ను సంబంధిత పోలీస్ స్టేషన్ లో అందించాలని సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించకుండా ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవాలని ఎస్పీసూచించారు.