18-08-2025 02:06:43 AM
కోరుట్ల ఆగస్టు 17 (విజయక్రాంతి) కోరుట్ల పట్టణంలో గల అతి పురాతనమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం ప్రభుత్వ విప్ వేములవాడ నియోజకవర్గం శాసనస భ్యులు ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు లు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్ర భుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ చైర్మన్ ఎతిరాజం నర్సయ్య ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ని శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ నాయకులు పుప్పాల ప్రభాకర్ ఎంబేరి నాగభూషణం కోరుట్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఎలేటి మహిపాల్ రెడ్డి పలువురు నాయకులు కార్యకర్తలు తదితరులుపాల్గొన్నారు.