31-07-2025 01:31:31 AM
రెండు బైకులు, తొమ్మిది మొబైల్ ఫోన్లు స్వాధీనం
కుత్బుల్లాపూర్, జులై 30(విజయ క్రాంతి): అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకొని మొబైల్ ఫోన్లను దొంగలిస్తున్న ముఠా ను జీడిమెట్ల పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.ఈ నెల 27 వ తేదీన సాయంత్రం 3 గంటల సమయంలో డి. అఖిల(21)అనే అమ్మాయి విధులు ముగించు కొని ఫోన్లో మాట్లాడుతూ హాస్టల్‌కు వెళ్తుంది. షాపూర్ నగర్‌లో శుభం హోటల్ సమీపంలోకి రాగానే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వెనుకనుండి అమ్మాయిని ఢీ కొట్టి,బలవంతంగా నెట్టి, తన ఫోన్ ను లాక్కున్నారు.
బైక్‌తో ఢీ కొట్టగా తన చెవికి గాయాలయ్యాయి. బాధితురాలు వెంటనే జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిం చి వాటి ఆధారంగా నిందితు లను అరెస్టు చేశారు. నిందితులు A1) ఆర్. వైజయంత్ (19), A2) ఆర్.శివ(21), A3).ఆర్. నరేష్ (23), A4).కుమార్, A5).వెంకట్ గా పోలీసులు గుర్తించారు.
నిందితులపై గతంలో పలు పోలీస్ స్టేషన్ లలో మొబైల్ ఫోన్ స్నాచింగ్, ఆటో మొబైల్ దొంగతనాల కేసు లు నమోదయ్యాయని, శివపై అత్యాచారం కేసు నమో దయ్యిందని పోలీసులు తెలిపారు. నిందితులు బహిరంగ ప్రదేశాలలో గంజాయి కొడుతూ, మందు తాగుతూ మత్తుకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్నామని ఒప్పుకున్నారు. నిందితుల వద్ద నుండి సుమారు 3.5 లక్షల విలువైన రెండు బైకులను, 9 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు.