31-07-2025 01:30:15 AM
ఆగస్టు 11న సీట్ల కేటాయింపు
హైదరాబాద్, జూలై 30 (విజయక్రాంతి): డీఈఈసెట్‌లో ఈడబ్ల్యూ ఎస్ కోటాను అమలు చేయనున్నా రు. ఈమేరకు బుధవారం పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఇ.నవీన్ ని కోలస్ ఓ ప్రకటనను విడుదల చేశా రు. గత కొన్నేళ్లుగా డీఈఈసెట్‌లో ఈ డబ్ల్యూఎస్ కోటాను అమలు చేయడంలేదు.
దీంతో మేనేజ్‌మెంట్ కోటా లో చేరే అభ్యర్థులు నష్టపోతున్నారని ఆయన దృష్టికి రావడంతో గురువా రం నుంచి చేపట్టే కౌన్సెలింగ్‌లో ఈడబ్ల్యూఎస్ వారికి అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కోటాలో 404 సీట్లు అందుబాటులో ఉన్నా యి. అభ్యర్థులకు ఆగస్టు 3 నుంచి 5 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ, వెబ్ ఆప్షన్లు నమోదుకు ఆగస్టు 6, 7 తేదీల్లో అవకాశం కల్పించారు. అదే నెల 11న సీట్లను కేటాయిస్తారు.