calender_icon.png 4 August, 2025 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గజ్వేల్ హస్తంలో లొల్లి

04-08-2025 01:08:27 AM

-రసాభాసగా రేషన్ కార్డుల పంపిణీ 

-వేదిక ఎక్కిన మైనంపల్లి వర్గీయులు

- దించేయాలని నర్సారెడ్డి అనుచరుల ఆందోళన

-మంత్రి వివేక్ ఎదుటే ఇరువర్గాల వాగ్వాదం

గజ్వేల్, ఆగస్టు 3: సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆదివారం నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఎదుటే కాంగ్రెస్ నాయకులు రచ్చ చేశారు. ప్రొటోకాల్ ప్రకారం మైనంపల్లి హనుమంతరావు వర్గమైన ఆత్మ కమిటీ చైర్మన్ మద్దూరు మల్లారెడ్డితోపాటు, జిల్లా ఎస్సీ సెల్ నాయకుడు విజయ్‌కుమార్ స్టేజిపైన ఉండటంతో డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి వర్గీయులు నినాదాలు చేస్తూ వేదిక పైకి వెళ్లడానికి ప్రయత్నించారు.

దీంతో వేదిక ముందు రసాభాసగా మారింది. దాదాపు 15 నిమిషాల పాటు కార్యకర్తలు నర్సారెడ్డి జిందా బాద్ అంటూ మల్లారెడ్డిని కిందికి దించాలని డిమాండ్ చేశారు. పోలీసులు కాంగ్రె స్ కార్యకర్తలను పక్కకు తీసుకువెళ్తుండగా మల్లారెడ్డిని, విజయ్‌కుమార్‌ను నర్సారెడ్డి, ఆయన వర్గీయులు కొట్టడానికి ప్రయత్నిం చి గొడవ చేస్తుండటంతో  మంత్రి వివేక్ వెంకటస్వామి కల్పించుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో గొడవ చేయొద్దని, పార్టీ విషయాలు తర్వాత మాట్లాడుకుందామని నర్సారెడ్డిని గొడవ ఆపించాలని చెప్పారు.

బయట మాట్లాడుకుందాం అంటూ కార్యకర్తలకు చెప్పడంతో బయటకు వెళ్లారు. కార్యక్రమం అనంతరం నర్సారెడ్డి, నాయకులు మంత్రి వివేక్‌తో మాట్లాడడానికి అవకాశం కల్పించారు. కాగా డీసీసీ అ ధ్యక్షుడు నర్సారెడ్డి తమపై దాడి చేశారని, ప్రొటోకాల్ పాటించకుండా అడ్డుపడ్డారని, కులం పేరుతో దూషించాడని ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు విజయ్‌కుమార్, రాష్ర్ట కమిటీ సభ్యుడు నాయిని యాదగిరి గజ్వేల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం అం బేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి విలేకరులతో మాట్లాడారు.

నర్సారెడ్డి అహంకారం తో పార్టీ కోసం నిరంతరం కష్టపడ్డ నాయకులను, కార్యకర్తలను పక్కన పెడుతున్నాడని, అవమానిస్తున్నాడని ఆరోపించారు. కార్యక్రమానికి వస్తున్న మంత్రి వివేక్‌ను సిద్దిపేటలో కలిసి పార్టీ పరిస్థితిల గురించి వెల్లడించామని, ప్రోటోకాల్‌కు ఇబ్బంది అవుతుందని చెప్పడంతో కార్యక్రమంలో ప్రొటోకాల్ మే రకు తనను వేదికపైకి రమ్మని సైగ చేసినట్లు మల్లారెడ్డి తెలిపారు.

కానీ వేదిక పైకి వెళ్తున్న క్రమంలో నర్సారెడ్డి సూచన మేరకే ఆయన వర్గీయులు తనను అడ్డుకొని ఆందోళన చేశారని, తనను కొట్టారని ఆవేదన వ్యక్తం చేశా రు. విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కార్యకర్తలను, నాయకులను నర్సారెడ్డి అవమానా లకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తనను కులం పేరుతోనే కాక, ఇతర దుర్భాషలాడుతూ కొట్టాడని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సత్తా ఇకపై చూపిస్తామని హెచ్చరించారు.