calender_icon.png 4 August, 2025 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన షెడ్డు నిర్మాణానికి భూమిపూజ

31-07-2025 01:31:31 AM

ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్  ఎ.పావని వినయ్ కుమార్ 

ముషీరాబాద్, జూలై 30(విజయక్రాంతి): ఆర్ టీ సి క్రాస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం ఆవరణలో భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించ తలపెట్టిన షెడ్డు నిర్మాణం కొరకు బుధవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముషీరాబాద్ శాసన సభ్యులు  ముఠా గోపాల్, మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్, గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్, బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యులు పూస రాజు పాల్గొన్నారు.

ఈ  కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, ఆలయ ఈ ఓ లక్ష్మా రెడ్డి, పునర్నిర్మాణ కమిటీ ఛైర్మెన్ మర్రిషెట్టి నర్సింగ్ రావు, కమిటీ సభ్యులు, బిజెపి డివిజన్ అధ్యక్షులు వి.నవీన్ కుమార్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.