calender_icon.png 6 September, 2025 | 9:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనాపూర్ కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం కమిటీ ఏకగ్రీవం

06-09-2025 12:00:00 AM

ఘట్‌కేసర్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ మున్సిపల్  ఘనపురం గ్రామ కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం నూతన కమిటీని శుక్రవారం ఏకగ్రీవకంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా ఉప్పల్ సర్కిల్ సీనియర్ ఇన్ స్పెక్టర్  సిద్దిరామేశ్వర్ హాజరై నూతన కమిటీని ప్రకటించారు.

ఆనంతరం నూతన కమిటి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. గౌడ సంఘం నూతన అధ్యక్షులుగా వేముల పరమేష్ గౌడ్, ఉపాధ్యక్షులుగా వేముల రమేష్ గౌడ్, కార్యదర్శిగా మండల రమేష్ గౌడ్, డైరెక్టర్లుగా వేముల లలితగౌడ్, వేముల పద్మ గౌడ్, వేముల శంకర్ గౌడ్, వేముల హేమంత్ గౌడ్, కీస రాజేశ్వర్ గౌడ్, కమిటీ సలహాదారులుగా వేముల గోవర్ధన్ గౌడ్, వేముల శ్రీనివాస్ గౌడ్, ఈకార్యక్రమనికి ముఖ్య అతిధిగా మేడ్చల్ నియోజకవర్గం బీబ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ విచ్చేసి నూతన కమిటి పాలక వర్గానికి తన హార్దిక శుభాకాంక్షలు తెలియజేసి పదవి ప్రమాణం స్వీకరించిన కమిటీని పూలమాలలు, శాలువాలతో సత్కరించడం జరిగింది.

ఈసందర్బంగా గౌడ సంఘం నూతన అధ్యక్షులు వేముల పరమేష్ గౌడ్ మాట్లాడుతూ ఘనపురం గౌడ సంఘం ఎన్నికలను ఏకగ్రీవకంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక సభ్యునికి, పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. సంఘం అభివృద్ధికి ప్రతి నిత్యం అహర్నిశలు కృషి చేస్తానని దీనికి సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు,మాజీ కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.