25-12-2025 01:20:19 AM
* మేడారం జాతరలో భక్తుల దర్శనానికి ఒకే వరుసలో.. ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం నూతనంగా ఏర్పాటుచేసిన రాతి గద్దెల మీద బుధవారం పగిడిద్దరాజు, గోవిందరాజుల ప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆదివాసీ డోలు చప్పుళ్లతో, సంప్రదాయ నృత్యాలతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆదివాసీ పూజారులంతా హాజరయ్యారు.
మేడారం/ములుగు/తాడ్వాయి, డిసెంబర్ 24 (విజయక్రాంతి): ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం జాతరలో తొలి ఘట్టం బుధవారం ఉదయం ఆవిషృతమైంది. పునరుద్ధరణ పనుల్లో భాగంగా భక్తుల కు దర్శన సౌకర్యార్థం ఒకే వరుసలో నూతనంగా ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం ఏర్పాటు చేసిన నూతన రాతి గద్దెల మీద ఆదివాసీ డోలు చప్పుళ్లతో, సంప్రదాయ నృత్యాల తో అంగరంగ వైభవంగా పగిడిద్దరాజు, గోవిందరాజుల ప్రతిష్ఠాపన కార్యక్రమం చేపట్టారు.
ఏటునాగారం మండలం కొండాయి గ్రామం నుంచి దబ్బకట్ల వంశీయులైన గోవిందరాజు ల పూజారులు డబ్బాకట్ల గోవర్ధన్ ఆధ్వర్యం లో మేడారం తరలివచ్చారు. మేడారం సమ్మ క్క సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని పసుపు కుం కుమ బండారితో పూదిచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం రాతి నిర్మాణాలతో కొత్తగా ఏర్పాటు చేసిన గద్దెకు చేరుకున్నారు. నూతన వస్త్రాలతో గద్దెను అలంకరించిన పూజారులు రహస్య పూజలు నిర్వహించారు.
ఉదయం 6 గంటలకు గోవిందరాజు సారలమ్మ భర్త, ధైర్యవంతుడైన యోధుడు తన నూతన గద్దెపై గజస్తంభం రూపంలో అడుగుపెట్టాడు. ఇక మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగుండ్ల గ్రామం నుంచి పెనుక వంశస్థులు పగిడిద్దరాజు పూజారులు బుచ్చిరామ య్య రాజేశ్వర ఆధ్వర్యంలో మేడారం గజస్తంభంతో తరలివచ్చారు. ఆదివాసీ యుద్ధవీరు డు, సమ్మక్క జీవిత సఖుడు పగిడిద్దరాజు ఉద యం 9.45 గంటలకు గద్దెపై తన శాశ్వత సింహాసనంపై ఆసీనుడయ్యాడు.
ఈ వేడుకల కు భక్తులు తరలివచ్చారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ములుగు కలెక్టర్ దివాకర టిఎస్, ఎస్పి కేకన్ సుధీర్ రామ్నాథ్, మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, సారలమ్మ పూజారి కాక సారయ్య, కాక వెంకటేశ్వర్లు, బయ్యక్కపేట సమ్మక్క పూజారులు, పగిడిద్దరాజు పూజారులు, గోవిందరాజుల పూజారులు పాల్గొన్నారు.
పూజారుల అనుమతితోనే గద్దెల తరలింపు: మంత్రి సీతక్క
మేడారంలోనీ పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల తరలింపు, పూజారుల అనుమ తితోనే ప్రతిష్ఠాపన చేస్తున్నామని, పూర్వికులు ఇచ్చిన ఆదేశాలతో పాటు పకృతి సిద్ధాంతాన్ని ఆచరిస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఎస్‌ఎస్ తాడ్వా యి మండలంలోని మేడారంలో బుధవారం జరిగిన పగిడిద్దరాజు, గోవిందరాజుల ప్రతిష్ఠాపన కార్యక్రమం లో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడు తూ.. పునరుద్ధరణ పనులు చేపట్టే సమయంలో గిరిజన పూజారులతో అనేకసార్లు సమావేశాలు నిర్వహించి, పెద్దల అభిప్రా యం తీసుకుని ఒకే వరుసలో వన దేవతలు ఉండటం వలన భక్తులు దర్శనాలు చేసుకోవడానికి సులువుగా మారుతుందని అభిప్రా యం వ్యక్తం చేశారు.
బుధవారం మొదటి ఘట్టం ప్రారంభమైందని, అన్ని కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తామని తెలిపారు. సమ్మక్క తల్లి గోత్రం బండారి గోత్రమని, తమ ఆదివాసీల సంప్రదాయం ప్రకారం ప్రతి పనిని కుడి నుంచి ఎడమవైపు నడుస్తుందని, నవగ్రహాలు సైతం కుడి నుంచి ఎడమవైపే తిరుగుతున్నాయని వివరించారు. స్వస్తిక్ ఏర్పాటు చేసే విషయంలో సైతం పకృతి సిద్ధాంతాన్ని ఆచరిం చామని వివరించారు.