calender_icon.png 29 October, 2025 | 4:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేవలో నిబద్ధతకు గుర్తింపు

29-10-2025 02:26:33 PM

సిద్దిపేట కలెక్టరేట్: రాజన్న సిరిసిల్ల జిల్లాకు అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గా బదిలీపై వెళ్లిన గరీమ అగ్రవాల్ గౌరవార్థం సిద్ధిపేట కలెక్టరేట్‌లో సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హైమావతి హాజరై, గరీమ అగ్రవాల్‌కు చీర కప్పి సన్మానం చేశారు. ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గరీమ అగ్రవాల్ పరిపాలనలో దక్షత, క్రమశిక్షణ, ప్రజా సేవాభావం ప్రశంసనీయం. ఏ పని చెప్పినా నిజాయితీగా పూర్తి చేస్తారని తెలిపారు. గత నాలుగు నెలలుగా కలిసి పనిచేసిన కాలంలో పరిపాలనలో ఎంతో తోడ్పాటు అందించారు. ఇందిరమ్మ ఇండ్లు, వనమహోత్సవం, మంత్రుల పర్యటనలు, స్థానిక సంస్థల ఎన్నికల ప్రిపరేషన్లలోనూ కీలక పాత్ర పోషించారు. రూల్స్ ప్రకారం విధులు నిర్వహించడంలో గరీమ అగ్రవాల్ కు ఉన్న సామర్థ్యం ప్రశంసనీయమనీ పేర్కొన్నారు.

అదనపు కలెక్టర్ గరీమ అగ్రవాల్ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా నాకు వృత్తిపరంగానూ, వ్యక్తిగతంగానూ మర్చిపోలేని అనుబంధం కలిగించిందని పేర్కొన్నారు.దుబ్బాక అసెంబ్లీ ఎన్నికలు, ఋతుప్రేమ, స్టీల్ బ్యాంక్, ఇందిరమ్మ ఇండ్లు, హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు అభివృద్ధి వంటి పలు కార్యక్రమాల్లో పాల్గొనడం విలువైన అనుభవం.జిల్లాలో కలెక్టర్లు ప్రశాంత్ పాటిల్, మను చౌదరి, కె.హైమావతి మార్గదర్శకత్వంలో పనిచేయడం గర్వకారణం అన్నారు.అదనంగా జిల్లా అధికారులు నాకు సీమంతం నిర్వహించడం వంటి వ్యక్తిగత అనుభవాలు సిద్దిపేట నాకు రెండో ఇంటిలా అనిపించాయని భావోద్వేగంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్,వివిధ శాఖల జిల్లా అధికారులు,మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.