calender_icon.png 29 October, 2025 | 4:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాడ్మింటన్ కేయూ జట్టుకు మిమ్స్ విద్యార్థి

29-10-2025 02:28:50 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): కాకతీయ యూనివర్సిటీలో ఈ నెల 15, 16, 17 తేదీలలో జరిగిన అంతర్జిల్లాల బ్యాడ్మింటన్ పోటీలలో ప్రతిభ కనబర్చి కాకతీయ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైనట్లు మంచిర్యాలలోని మిమ్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పీ ఉపేందర్ రెడ్డి బుధ వారం తెలిపారు. నవంబర్ 21, 22, 23 తేదీల్లో బెంగుళూరులో జరిగే సౌత్ జోన్ టోర్నమెంటులో కాకతీయ యూనివర్సిటీ జట్టుకు కెప్టెన్ గా బీకాం ఫైనల్ ఇయర్ విద్యార్థి ఎన్ అశ్విత ఎంపికైందన్నారు. వరుసగా రెండు సార్లు కేయూ బ్యాట్మింటన్ జట్టుకు ఎంపికవడం ఆనందంగా ఉందన్నారు. అశ్వితని కరస్పాండెంటు టీ శ్రీనివాస రాజు, వైస్ ప్రిన్సిపాల్ పీ శ్రీధర్ రావు, డైరెక్టర్ ఎం విజయ్ కుమార్, పీడీ నూనె శ్రీనివాస్, కళాశాల అధ్యాపక బృందం అభినందించారు.