21 March, 2026 | 10:09 PM

అప్రమత్తంగా విధులు నిర్వహించాలి

21-03-2026 12:45 AM

నిర్మల్, మార్చి 20 (విజయక్రాంతి): రంజాన్ పండుగ సందర్భంగా, భైంసా పట్టణంలోని గడ్డన్నవాగు వద్ద ఉన్న ఈద్గా దగ్గర ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల పరిశీలించారు. ఈ మేరకు ఎస్పీ ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లపై శుక్రవారం అధికారులకు పలు సూచనలు చేశారు. రంజాన్ పండ గ సందర్భంగా పెద్ద ఎత్తున ముస్లిం సహోదరులు ప్రార్థనలు చేసుకోవడానికి ఈద్గాను సందర్శిస్తారు.

దీంతో ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు, ప్రజల రాకపోకల నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారు లు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. ఏఎస్పీ సాయి కిరణ్, ఇన్‌స్పెక్టర్లు, ఆర్.ఐ లు,ఎస్.ఐలు, ఆర్.ఎస్.ఐ లు,పోలీస్ సిబ్బంది ఉన్నారు.

ఎస్పీ కార్యాలయంలో ఇఫ్తార్ విందు 

జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో రంజాన్ పండుగను మైనార్టీ ఉద్యోగులకు ఎస్పీ జానకి షర్మిల ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసి, పండుగ శుభాకాంక్షలు తెలిపారు.