15-10-2025 10:06:38 PM
హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా ఎర్రగట్టు గుట్ట ప్రాంతానికి చెందిన ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల డైరెక్టర్ బి.గట్టయ్య యాదవ్ కు ఉస్మానియా విశ్వవిద్యాలయం కామర్స్ విభాగంలో డాక్టరేట్ ప్రధానం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ సినియర్ ప్రొఫెసర్ డి. చెన్నప్ప పర్యవేక్షణలో ఈ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఇన్ తెలంగాణ ఏ స్టడీ ఆఫ్ సెలక్ట్ డిస్టిక్స్ ఇన్ తెలంగాణ స్టేట్ అనే అంశంపై పరిశోధన పూర్తి చేసినందుకుగాను బి. గట్టయ్యయాదవ్ సమర్పించిన పరిశోధనా గ్రంధాన్ని పరిశీలించిన ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ అధికారులు ఆయనకు పీహెచ్‌డీ పట్టాను ప్రదానం చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా బి గట్టయ్య యాదవ్ ను కుటుంబ సభ్యులు బందుమిత్రులు, వివిధ విద్యాసంస్ధల యాజమాన్యులు అభినందించారు.