calender_icon.png 16 October, 2025 | 1:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర స్థాయి పోటీలకు మైనార్టీ గురుకుల విద్యార్థి ఎంపిక

15-10-2025 10:09:42 PM

వేములవాడ టౌన్ (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి ఎస్జిఎఫ్ అండర్-17 టోర్నమెంట్ వేములవాడ పట్టణంలోని మైనారిటీ గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న రొమాల శ్యాం కుమార్ అత్యంత ప్రతిభ కనబరిచి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైయ్యాడు. ఈ సందర్భంగా రొమాల శ్యాం కుమార్ జట్టును రెండవ స్థానంలో నిలపడంలో కీలకపాత్ర వహించి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈనెల 16 నుండి 18 వరకు పటాన్చెరులోని సంగారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు పెట్ షబానా, పీడీ అక్కెనపల్లి దేవయ్యలు తెలిపారు. విద్యార్థి ఎంపిక పట్ల కళాశాల అధ్యాపక బృందం, పాఠశాల ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.