15-10-2025 10:03:45 PM
మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని ప్రభుత్వ ఆదర్శ (మోడల్) పాఠశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి పి మణిదీప్ జాతీయస్థాయి ఫుట్ బాల్ పోటీలకు ఎంపిక అయ్యాడని పాఠశాల ప్రిన్సిపల్ సారా తస్నీమ్ బుధవారం తెలిపారు. అక్టోబర్ 6, 10 న జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ నిర్వహించిన జాతీయ స్థాయి ఎస్జీఎఫ్ అండర్ 19 ఫుట్ బాల్ ఎంపిక పోటీలలో మణిదీప్ పాల్గొని, సత్తా చాటాడని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రస్థాయి అండర్ 19 కబడ్డీ పోటీలకు మోడల్ కళాశాలకు చెందిన విద్యార్థిని శశిరేఖ ఎంపికైనట్లు తెలిపారు.
ఇటీవల నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి పోటీల్లో మెరుగైన ప్రదర్శన ఇచ్చిన క్రీడాకారులు మహబూబాబాద్ జిల్లాలో జరిగే పోటీల్లో ఉమ్మడి జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలిపారు. ఆదర్శ పాఠశాలలో చదువుతో పాటు క్రీడలకు ప్రాముఖ్యత ఇస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను పాఠశాల అధ్యాపక బృందం అభినందించారు. ఈ కార్యక్రమంలో పిడి చిన్నక్క పాల్గొన్నారు.