calender_icon.png 7 August, 2025 | 3:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న గౌతమ్‌నగర్ డివిజన్ కార్పొరేటర్

05-08-2025 01:45:47 AM

మల్కాజిగిరి, ఆగస్టు 4: మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని చిన్మయి మార్గులో నెలకొన్న వర్షపు నీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వర్షపు నీరు సజావుగా ప్రవహించేందుకు ఏర్పాటుచేసిన వెంట్ చిన్నగా ఉండటంతో వరద నీరు నిలిచిపోతుందని, దీని వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ఈ సమస్యను పరిష్కరించేందుకు డీసీ జకియా సుల్తానా, ఏసీపీ శ్రీనివాస్, ఈఈ లక్ష్మణ్, టి.పీ.ఎస్ సంగీత, డీఈ లౌక్య తదితర అధికారులతో సమావేశమయ్యారు. వెంట్ వెడల్పు పెంపుదల కోసం అడ్డుగా ఉన్న రెండు ఇండ్లను ఇప్పటికే మార్కింగ్ చేసినట్లు తెలిపారు. సంబంధిత ఇళ్ల యజమానులకు నష్టపరిహారం చెల్లించి వెంట్ విస్తరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ మేకల సునీత కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేకల రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు.