calender_icon.png 6 August, 2025 | 9:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్‌కు ‘గువ్వల’ షాక్!

05-08-2025 01:42:49 AM

- పార్టీ సభ్యత్వానికి, నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా

- కమలం గూటికి వెళ్లేందుకు కార్యాచరణ

- కార్యకర్తలతో సంప్రదింపులు

- ఉద్యమ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నారంటూ లీకులు

నాగర్‌కర్నూల్, ఆగస్టు 4 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా బీఆర్‌ఎస్ పా ర్టీ అధ్యక్షుడు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గు వ్వల బాలరాజు ఆ పార్టీ సభ్యత్వానికి, జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ సోమవారం పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు రాజీనామా లేఖను పంపారు. త్వరలోనే క మలం గూటికి చేరేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే స్థానిక సం స్థల ఎన్నికల్లోనూ బీజేపీ, బీఆర్‌ఎస్‌తో పొ త్తు పెట్టుకోవచ్చని, లేదా బీజేపీలో విలీనం చేసే యోచనలో ఉన్నట్లు తన సన్నిహిత వ ర్గాలతో గువ్వల చర్చించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ముందే పార్టీ మారితే తగిన ప్రా ధాన్యత ఉంటుందన్న ఆలోచనలోనే కమ లం గూటికి చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

నీళ్లు, నిధులు, నియామకాల కోసం పరాయి పాలనను వ్యతిరేకిస్తూ ఉద్యమ కాగడను ఎత్తిన గువ్వల రథసారథి కేసీఆర్ వెం టే నడిచారు. ప్రత్యేక తెలంగాణలో రెండు పర్యాయాలు అచ్చంపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2023లో ఓటమి పాలయ్యారు. అనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ ఎంపీ టికెట్ కోసం పోటీ పడ్డారు. కానీ ఆ టికెట్ బీఎస్పీ నుంచి బీఆర్‌ఎస్ పార్టీలోకి చేరిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌కు మార్‌కు దక్కడంతో భంగపడ్డారు. ఆ త ర్వాత జరిగిన అనేక కార్యక్రమాల్లోనూ పా ల్గొనేందుకు ముందుకు వచ్చినా ప్రజల నుంచి తగిన గౌరవం దక్కకపోవడంతో తన పంతాను మార్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఫామ్‌హౌస్ ఘటన నేపథ్యంలో విరమించుకున్నట్టు తెలిసింది. 

12 మంది మాజీలు కూడా బీజేపీలోకి!

అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేయ డంతో.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ని సుమారు 12 మంది మాజీ ఎమ్మెల్యేలు కమలం గూటికి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతున్నది. ఆయా మాజీ ఎమ్మెల్యేల కార్యకర్తలు, అనుచరులు, అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. ఇప్పటికే అచ్చంపేట నియోజకవర్గం పదర మాజీ జడ్పీటీసీ రాంబాబు బీఆర్‌ఎస్ పార్టీని వీడి సోమవారం మంత్రి జూపల్లి కృ ష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో వారితో పాటు మరికొంతమంది మాజీ జెడ్పిటిసిలు ఎంపీపీలు భారీ ఎత్తున కాంగ్రె స్ పార్టీలోకి చేరుతున్నట్లు అధికార పార్టీ ముఖ్య నేతలు చెప్తున్నారు.

నాపై తప్పుడు ప్రచారం: మర్రి జనార్దన్‌రెడ్డి

తాను పార్టీ మారుతానని పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆయన చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడుగుజాడల్లోనే నడుస్తూ, బీఆర్‌ఎస్ పార్టీలోనే కొనసాగుతానని సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.