calender_icon.png 26 January, 2026 | 12:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తులతో కిక్కిరిసిన ఏడుపాయల

26-01-2026 12:35:48 AM

  1. ఎటు చూసినా వనంలో జనమే.. జనం
  2. ఆలయానికి డుమ్మా కొట్టిన ఈవో చంద్రశేఖర్ 
  3. మహిళా భక్తుల అవస్థలు అన్ని.. ఇన్ని.. కావు
  4. ఏడుపాయల పరిస్థితి ఎప్పటికీ మెరుగుపడేనో..

పాపన్నపేట, జనవరి 25:ఎటు చూసినా జనమే జనం.. అందరిలో భక్తి భావం.. ఆ ధ్యాత్మిక వాతావరణం.. గలగల పారే గం గమ్మ పరవళ్ళు.. ఇది రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ మాత క్షేత్రం సొంతం. దేశంలోనే రెం డో వనదుర్గా మాత ఆలయంగా, జనమేజయుని సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.

ఆదివారం సెలవు దినం కావడంతో జిల్లా నలుమూల నుంచే కాకుండా ఇతర జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుంచి భక్తు లు అమ్మ దర్శనానికి పోటెత్తారు. పలువురు భక్తులు బోనాలు, ఒడి బియ్యం, తలనీలాలు, ఆయా మొక్కలు సమర్పించుకు న్నా రు. వనదుర్గమ్మను దర్శించి చల్లంగా చూడ మ్మా.. తల్లి అంటూ వేడుకున్నారు. 

 ఆలయానికి రాని ఈవో చంద్రశేఖర్

 ఆదివారం ఏడుపాయల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. వచ్చిన భక్తులు ఇబ్బందులు పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిం చాల్సిన ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆదివా రం ఆలయానికి డుమ్మా కొట్టాడు. ఆదివారం రోజే ఈవో ఆలయానికి రాకపోవ డంతో భక్తులు మండిపడ్డారు. ఈవో రాకపోవడంతో కిందిస్థాయి సిబ్బంది సైతం నిర్ల క్ష్యంగా వ్యవహరించే అవకాశం ఉందం టూ భక్తులు విస్మయం వ్యక్తం చేశారు. ఈవోను సంప్రదించే ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదు. అక్కడే ఉన్న జూనియర్ అసిస్టెంట్ సూర్య శ్రీనివాస్ ను అడగగా.. ఈవో కార్ డ్రైవర్ రాకపోవడంతో ఆలయానికి రాలేదని సమాధానమిచ్చారు.

 ఇబ్బందులు పడ్డ మహిళా భక్తులు..

మహిళా భక్తులకు వసతులు కరవయ్యా యి. మంజీరాలో పుణ్యస్నానమాచరించాక దుస్తులు మార్చుకునేందుకు గదులు, రేకుల షెడ్డు లాంటివి లేకపోవడంతో వారి అవస్థలు అన్నీ ఇన్ని కావు. సంవత్సరానికి రూ. కోట్లల్లో ఆదాయం ఉన్న వసతుల కల్పనలో శూన్యం. దీంతోపాటు కాలకృత్యాలు తీర్చుకునేందుకు సరైన మరుగుదొడ్లు లేవు. ముని పుట్టకు వెళ్లేదారిలో మరుగుదొడ్లు నిర్మించినా వినియోగించకపోవడంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు దృష్టిసారించి అవస్థలు తీర్చాలని భక్తులు కోరుతున్నారు.