11-05-2025 10:03:45 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామానికి చెందిన చీకటి ప్రభాకర్ అనే గీత కార్మికుడు ఆదివారం తాటి చెట్టు పైనుంచి ప్రమాదవశాత్తు జారిపడి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నెల్లికుదురు ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపారు.