11-05-2025 10:08:33 PM
తొర్రూరు: దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్ల త్యాగాలు వృధా కావని టిడిపి తొర్రూరు మండల అధ్యక్షుడు భోగ భాస్కర్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఆదివారం టిడిపి ఆధ్వర్యంలో దేశ సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతూ ప్రాణాలు అర్పించిన జవాన్ మురళి నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పాకిస్తాన్ లోని ఉగ్రస్తావరాలపై భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ లో తెలుగు బిడ్డ వీరమరణం పొందడం బాధాకరమన్నారు.
సైనికుల త్యాగాలను దేశ ప్రజలు మరువబోరని తెలిపారు. జవాన్ల త్యాగాల వల్లే దేశ ప్రజలు సుఖంగా నిద్రపోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి పెద్దవంగర, కొడకండ్ల మండల అధ్యక్షులు బైన బిక్షపతి, ఎరుకల శ్రీనివాస్ గౌడ్, నాయకులు సముద్రాల సోమయ్య, ఆర్. వెంకటేశ్వర్లు,ఘనపురం ఐలయ్య, కడుదుల రామయ్య, గుగులోత్ రమేష్, బోలగాని చిత్తరంజన్, వేల్పుల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.