calender_icon.png 12 May, 2025 | 5:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతుల కుటుంబాలకు ప్రభుత్వ విప్ పరామర్శ

11-05-2025 10:01:22 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణ సమీపంలో నాలుగు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు యువకులు గుగులోతు కార్తీక్, భూక్యా సంతోష్, అజ్మీర సుధీర్ కుటుంబాలను డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ ఆదివారం పరామర్శించారు. బావోజీ గూడెం గ్రామ పరిధిలోని బొజ్యా తండా,  వాగు ఒడ్డు తండా, వెక్కురం తండాలకు వెళ్లి మృతుల తల్లిదండ్రులను పరామర్శించి, ఓదార్చారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మృతి చెందిన యువకుల తల్లిదండ్రులు తమ కుమారుల ప్రమాద ఘటనపై అనుమానాలు వ్యక్తం చేసి, సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి, నాయకులు కాలం రవీందర్ రెడ్డి, దిగిచర్ల జగదీష్, గుగులోత్ రాజు, సుధాకర్, లక్ష్మీనారాయణ, వీరభద్రం, శ్రీను, సత్యం తదితరులు పాల్గొన్నారు.