calender_icon.png 1 May, 2025 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోర్టు ఉత్తర్వులను అమలు చేయని జెన్కో యాజమాన్యం

30-04-2025 10:47:53 PM

బట్టు కృష్ణ

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేటీపీఎస్ బూడిద చెరువు నుంచి బూడెద తొలకాలకు కాల పరిమితి లేకుండా కోర్టు ఉత్తర్వులు జారీచేసిన జన్కో యాజమాన్యం, కేటిపిఎస్ అధికారులు కోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదని గిరిజన పిటీషనర్ బట్టు కృష్ణ ఆరోపించారు. బుధవారం పాల్వంచలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... 2023లో హైకోర్టులో కేసు వేయగా డబ్ల్యూ పి నెంబర్ 11261/2024 ప్రకారం పెట్టేసి నారాయణ తనకు కేటిపిఎస్ కాంప్లెక్స్ నుంచి బూడిద రవాణాకు తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. ఆ తీర్పులో ఎలాంటి కాలపరిమితి లేకుండా కంటిన్యూగా బూడిద తోలుకోవాలని ఆర్డర్ ఇవ్వడం జరిగిందని తెలిపారు.

అయినా కేటీపీఎస్ అధికారులు, జెన్కో యాజమాన్యం నవంబర్ 2024 నుంచి మార్చి 31 2025 వరకు మాత్రమే బూడిద తోలకాలకు అనుమతి ఇచ్చారని, అందుకు రూ 45 లక్షల తాను డిపాజిట్ చేయడం జరిగిందన్నారు. మణుగూరు బిటిపిఎస్, అశ్వాపురం, నవభారత్ కర్మఘారాల్లో బూడిదను ఉచితంగా తోలుకోవడానికి అనుమతులు ఇస్తే, నామ మాత్రపు ధర చెల్లించి బూడిద తొలకాలకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అన్నారు. కేటీపీఎస్ యాజమాన్యం రూ 52. 50 ధర నిర్ణయించి డిపాజిట్ తీసుకోవడం జరిగిందన్నారు.

ఈ ఐదు నెలల కాలంలో కేవలం లక్ష మెట్రిగ టన్నులు మాత్రమే రవాణా చేశామన్నారు. బూడద తరలింపుకు ఎక్స్టెన్షన్ కోరుతూ ఫిబ్రవరి 7వ తేదీన కోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ ఇప్పటివరకు తనకు అనుమతి ఇవ్వలేదన్నారు. దీంతో కోర్టును ఆశ్రయించగా డబ్ల్యూ పి నెంబర్ 10977/2025 ప్రకారం పెట్టేసి నారాయణ తనకు ఆర్డర్ ఇవ్వాలని తీర్పు వచ్చినప్పటికీ జీన్కో యాజమాన్యం, కేటీపీఎస్ అధికారులు ఎక్స్టెన్షన్ ఆర్డర్ ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. తక్షణమే బోడెద తరలింపుకు ఎక్స్టెన్షన్ ఆర్డర్ ఇవ్వాలని అనే డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బి.వీరన్న, ఏ నరేష్ పాల్గొన్నారు.