01-05-2025 12:00:00 AM
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
దౌల్తాబాద్, ఏప్రిల్ 30: మార్కండేయ స్వామి దయతో సకాలంలో వర్షాలు కురుసి పాడి పంటలతో సస్యశ్యామలం కావాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. రాయపోల్ మండల కేంద్రంలో జరుగుతున్న శ్రీ మార్కండేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమానికి హాజరై ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని మొక్కలు చెల్లించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆలయాన్ని నిర్మించిన పద్మ శాలి కులస్తులను ఆయన అభినందించారు.