01-05-2025 12:00:00 AM
ప్రమాణ స్వీకారానికి హాజరైన ఎమ్మెల్యే
నారాయణఖేడ్, ఏప్రిల్ 30 : జిల్లాలో ప్రసిద్ధి చెందిన బోరించ నల్ల పోచమ్మ ఆలయ నూతన కమిటీని గురువారం ఎన్నుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పి.సంజీవరెడ్డి హాజరై ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అధ్యక్షునిగా బెల్లాపురం మల్లన్న, ఎక్స్ అఫీషియల్ మెంబర్లుగా చెట్టు కింద సిద్ధప్ప పోతనపల్లి పెంటన్న దండు సిద్ధప్ప ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ స్వామి ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, ఈవో శివ రుద్రప్ప సమక్షంలో కొనసాగింది. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు భోజిరెడ్డి, మున్నూరు కిషన్, దిగంబర్ రెడ్డి, న్యాయవాది సంగన్న, బ్రహ్మానంద రెడ్డి, సంతోష్ రెడ్డి, దిలీప్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.