05-09-2025 02:06:02 PM
హైదరాబాద్: జర్మనీకి చెందిన బీబిగ్ మెడికల్ కంపెనీ(BEBIG Medical Company) సీఈఓ జార్జ్ చాన్, ఒక ప్రతినిధి బృందంతో శుక్రవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని(CM Revanth Reddy) మర్యాదపూర్వకంగా కలిసింది. తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ ఎక్విప్‌మెంట్ ఉత్పత్తి యూనిట్ ప్రారంభానికి జర్మన్ కంపెనీ ఆసక్తి చూపింది. యూనిట్ ఏర్పాటుకు అవసరమైన అన్ని విధాలా సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. అనువైన స్థలం, ఇతర అంశాలు అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడికల్ ఎక్విప్ మెంట్(Medical Equipment), క్యాన్సర్ చికిత్స కోసం రేడియేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సీఎం కోరారు.