05-09-2025 02:28:14 PM
హైదరాబాద్: ఈనెల 15వ తేదికి పీసీసీ పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తి అవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) మీడియాతో పేర్కొన్నారు. కామరెడ్డిలో బహిరంగ సభ ఏర్పాటుకు సీఎం ఆదేశాలతో సన్నాహలు నిర్వహిస్తున్నట్లు.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలుపుకుని పోతున్నామని తెలిపారు. క్రమశిక్షణ విషయంలో ఎక్కడ కూడా రాజీపడలేదని.. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తున్నామని అన్నారు. అలాగే కార్యకర్తలను పార్టీ కార్యక్రమల్లో భాగస్వామ్యం చేస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా నిర్వహించాలని, సీబీఐలో కొంత లొసుగులు ఉన్నాయని.. అది వాస్తవాలు అని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే ముందుకు వెళతామని.. ఎమ్మెల్యేలు కోరుకుంటే రేవంత్ రెడ్డే మళ్లీ సీఎం అవుతారని అన్నారు. కాగా, ఖైరతాబాద్ గణపతిని మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.