07-09-2025 07:58:54 PM
పాల్గొన్న నవభారత్ నిర్మాన్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టుశ్రీధర్..
పటాన్ చెరు (విజయక్రాంతి): లక్డారం మాజీ ఎంపీటీసీ రాంచద్రారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని తలసేమియా బాధిత చిన్నారుల సహాయార్థం ఏర్పాటు చేసిన రక్తదాన కార్యక్రమంలో నవభారత్ నిర్మాన్ యువసేన(Navabharath Nirman Yuvasena) వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టుశ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. దివ్యాంగులకు, రక్తదాతలకు, అతిథులకు 70 దుప్పట్లు పంపిణీ చేశారు. యువతి యువకులు 36 యూనిట్లు ఇవ్వడం జరిగింది. ఈ సంధర్భంగా మెట్టు శ్రీధర్ మాట్లాడుతూ.. ఆదర్శ ఉమ్మడి కుటుంబంగా రాంచద్రారెడ్డి కొడుకులు కోడళ్ళతో కూతుళ్లతో కలిసి ఉండటం ప్రస్తుతసమాజానికి ఆదర్శమని 70వ జన్మదినం సంధర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి పేదలకు 70 దుప్పట్లు పంపిణీ చేయడాన్ని సమాజంపట్ల వారుకున్న అంకితభావాన్ని తెలియజేస్తుందన్నారు.
బలమైన కుటుంబ వ్యవస్థలే భారతదేశానికి పట్టుకొమ్మలని మెట్టు శ్రీధర్ ఈ సంధర్భంగా పేర్కొనడం జరిగింది రక్తదాతల నుండి 36 యూనిట్ల రక్తాన్ని సేకరించి వారికి సెర్టిఫికేట్లను అందించారు. ఈ కార్యక్రమంలో , కండర క్షీణిత వ్యాధి బాధితుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మడపతి రవికుమార్, రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు కాసాల రాఘవేంద్ర రెడ్డి, వెంకటేశ్వర స్వామి ఆలయం చైర్మన్ గోపాల్ రెడ్డి,యువ ఇస్నాపూర్ చైతన్య దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు కంచిగారి మహేష్ కుమార్,నీటి వినియోగ దారుల సంఘం మాజీ అధ్యక్షుడు రాంరెడ్డి, వాలంటీర్లు వెంకోబ, అన్వర్, జనార్దన్ రెడ్డి, బాపూ వెంకన్న, మణిరత్నం తదితరులు పాల్గొన్నారు.