07-09-2025 07:51:09 PM
బాన్సువాడ (విజయక్రాంతి): తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్(Telangana Gurukul Parents Association) ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మీడియా ప్రతినిధిగా బీర్కూర్ మండలంలోని బరంగ్ ఏడ్గి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కాదేపురం గంగన్నను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్బంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో టీజీపీఏ కామారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం కాదేపురం గంగన్న మాట్లాడుతూ.. జిల్లా కమిటీ ఎన్నికలో భాగంగా తనపై నమ్మకం ఉంచి తనను ఉమ్మడి జిల్లా మీడియా ప్రతినిధిగా ఎన్నుకోవడం చాలా సంతోషమని, ఉమ్మడి జిల్లాలో ఉన్న గురుకుల పాఠశాలల్లో గల సమస్యలను అదేవిదంగా విద్యార్థుల చదువు పట్ల కృషి చేస్తానని అన్నారు. తనను ఉమ్మడి జిల్లా మీడియా ప్రతినిధిగా ఎన్నుకున్న ప్రతీ గురుకుల పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలను తెలిపారు.