07-09-2025 08:13:56 PM
చివ్వెంల: చివ్వెంల పోలీస్ స్టేషన్(Chivvemla Police Station) వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. అర్ధరాత్రి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సూర్యాపేట మున్సిపాలిటీ ఐదో వార్డ్ మాజీ కౌన్సిలర్ ఎస్.కె భాషను అక్రమంగా అరెస్టు చేశారంటూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని దురాజ్ పల్లికి చెందిన మున్నీర్ ఖాన్ అనే వ్యక్తి శనివారం రాత్రి 11 గంటలకు గాయాలతో పోలీస్ స్టేషన్కి వచ్చి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎస్ కే భాష నన్ను పొడిచారని ఫిర్యాదు చేయడంతో విచారణ నిమిత్తం భాషను ఆదివారం ఉదయం పోలీస్ స్టేషన్కి తరలించమని తెలిపారు. ఇరువర్గాల మధ్య నెలకొన్న ఘటనల ఆధారంగా విచారణ చేసి కేసు నమోదు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు కావాలనే తప్పుడు ఫిర్యాదుతో మాజీ జడ్పీ కో అప్సన్ సభ్యులు, మాజీ కౌన్సిలర్ బాషా ను అక్రమ అరెస్ట్ చేసారంటూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆరోపించారు.