calender_icon.png 7 September, 2025 | 11:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డిలో మంత్రుల కాన్వాయ్ లో అపశృతి

07-09-2025 08:07:57 PM

షబ్బీర్ అలీ బుల్లెట్ ప్రూఫ్ వాహనం డ్యామేజ్..

ఊపిరి పీల్చుకున్న మంత్రులు..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) కేంద్రంలో మంత్రుల కాన్వాయ్ లో అపశృతి దొర్లింది. ఈనెల 15న కామారెడ్డిలో బీసీ సభ నిర్వహించేందుకు ఆదివారం కామారెడ్డిలో సన్నాహక సభ నిర్వహించారు. ఈ సన్నాహాక సభకు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి సురేఖ, రాష్ట్ర బీసీ శాఖ మంత్రి శ్రీహరి ముదిరాజ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీలు సన్నాహాక సమావేశాన్ని ముగించుకొని వెళ్తున్న సందర్భంలో మంత్రుల కాన్వాయ్ లోకి అడ్డంగా మధ్యలోకి కారు రావడంతో ఆ కారును తప్పించబోయి డివైడర్ కు షబ్బీర్ అలీ బుల్లెట్టు ప్రూఫ్ వాహనం డ్యామేజ్ అయింది. వాహన డ్రైవర్ చాకచక్యం వల్ల నలుగురు మంత్రుల ప్రాణాలు సురక్షితంగా బయటపడ్డారు. కారును తప్పించబోయి డివైడర్ తగిల డంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి గాయాలు కాకుండా బయటపడడంతో మంత్రులు ఊపిరి పీల్చుకున్నారు. డ్యామేజ్ అయిన షబ్బీర్ అలీ బుల్లెట్టు వాహనాన్ని హైదరాబాద్ కు పంపించారు. మంత్రులు సురక్షితంగా బయటపడడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.