calender_icon.png 23 July, 2025 | 11:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లైసెన్స్‌డ్ సర్వేయర్లు శిక్షణ పరీక్షల్లో ఉత్తమంగా రాణించాలి

23-07-2025 12:25:44 AM

జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ

గద్వాల టౌన్, జూలై 22 : లైసెనస్డ్ సర్వేయర్లు శిక్షణలో నేర్చుకున్న విషయాలను సద్వినియో గం చేసుకుని పరీక్షల్లో ఉత్తమంగా రాణించాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ అ న్నారు.మంగళవారం ఐడీఓసీ సమావేశం హాల్ నందు భూ భారతి లైసెనస్డ్ సర్వేయర్ల శిక్షణ కా ర్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భూ పరిపాలన వ్యవస్థను మరింత పారదర్శకంగా,సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

రెవెన్యూ,సర్వే విభాగాలు పరస్పరంగా అనుసంధానమై ఉన్నాయని,సర్వే విభాగం బ లోపేతంతోనే రెవెన్యూ వ్యవస్థలో సమర్థవంతమైన సేవలందించగలమన్నారు.భూమితి సాఫ్ట్వేర్ ద్వారా భూమికి సంబంధించిన సర్వేలు, మ్యాపింగ్,డేటా ప్రాసెసింగ్ వంటి సేవలను మరింత ఖచ్చితంగా, వేగంగా ప్రజలకు చేరువగా అందించగలుగుతున్నామని పేర్కొన్నారు.

జిల్లాలో లైసెనస్డ్ సర్వేయర్ శిక్షణ పొందిన 151 మంది అభ్యర్థులకు హాల్ టికెట్లు అధికారులచే మెయిల్ల నుం డి డౌన్లోడ్ చేసి అందజేయడం జరిగిందని తెలిపారు.శిక్షణ పొందిన అభ్యర్థులకు తుది రాత పరీక్షలు జూలై 27న నిర్వహించనున్నట్లు,జూలై 28-29న ల్యాబ్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. సర్వేయర్లు శిక్షణను సద్వినియోగం చేసుకొని, పరీక్షలను ఉత్తమంగా రాసి లైసెనస్డ్ సర్వేయర్లుగా మారాలని సూచించారు.

ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు లైసెనస్డ్ స ర్వేయర్ సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు వెల్లడించారు.అంతక ముందు సర్వే,ల్యాండ్ అండ్ రికారడ్స్ ఎడీ రామచందర్ సాఫ్ట్వే్ప అవగాహన కల్పించేందుకు అభ్యర్థులకు పిపిటి విధానం ద్వారా వివరంగా వివరించారు.ఈ కార్యక్రమంలో సర్వే ల్యాండ్ అండ్ రికారడ్స్ ఏడీ రామ్ చందర్, మండల సర్వేయర్లు,అభ్యర్థులు, తదితరులు పాల్గొన్నారు.