calender_icon.png 11 October, 2025 | 10:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడిపిల్లలను సమయానికి బడికి చేరవేయండి

11-10-2025 12:30:49 AM

డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ ఉదయభాస్కర్ ఆదేశం 

నిజామాబాద్ అక్టోబర్ 10 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా రెంజల్ మం డ లం కందకుర్తి గ్రామానికి చెందిన విద్యార్థులు రెంజల్ మండల కేంద్రంలోని ప్రభు త్వ పాఠశాలకు బస్సులో వెళ్ళడానికి ఎదు రు చూపులు చూస్తూ సమయానికి బస్సు లు రా కపోవడంతో పాఠశాలకు వెళ్ళడానికి సమ యం మించి పోవడంతో బస్సుల ముందు నిలబడి నిరసన తెలిపిన విషయా లు మీడి యా ద్వారా తెలుసుకున్న నిజామాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి,, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు నిజా మాబాద్ బస్ డిపో రీజినల్ మేనేజర్ జ్యోత్స్న, డిప్యూటీ రీజినల్ మేనేజర్ మధుసుధన్‌లను జిల్లాకోర్టు లోని తన కార్యాలయం న్యాయసేవ సదన్ కు పిలిపించి మాట్లాడారు.

విద్యార్థులకు ఎ లాంటి ఇబ్బందులు ఎదురు కావద్దని, వి ద్యను అభ్యసించే వారికి అవరోదాలు ఉం డరాదనీ సూచించారు. బడి వేళల లోపు బ స్సులు వెళ్లే విదంగా చూడాలని అన్నారు. విద్యార్థులు సమయానికి పాఠశాలకు వెళ్లకుంటే అది వారి చదువుపై ప్రభావం పదుతుందని తెలిపారు. బడుల వేళలకే బస్సు లు వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు.