11-10-2025 12:31:00 AM
అభివృద్ధి పనుల పరిశీలినలో ఎమ్మెల్యే విజయ రమణారావు
పెద్దపల్లి, అక్టోబర్ 10(విజయ క్రాంతి) పట్టణంలోని చీకురాయి చౌరస్తా నుండి చీకురాయి మొదటి రైల్వే గేటు వరకు జరుగుతున్న డబల్ రోడ్డు పనులను పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామణరావు మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, స్థానిక నాయకులతో కలిసి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలోని చౌరస్తా నుండి మొదటి రైల్వే గేట్ వరకు డబల్ రోడ్డు నిర్మాణ పనులు దాదాపు రూ. 3.5 కోట్లతో పనులు మొదలు పెట్టడం జరిగిందని, డ్రైనేజ్ నిర్మాణానికి రూ. 40 లక్షలు వెచ్చించి, మొత్తం నాలుగు కోట్లతో పెద్దపల్లి పట్టణానికి ముఖద్వారంగా ఈ రోడ్డు నిర్మించడం జరుగుతుందని, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ నుండి వచ్చేందుకు వీలుగా మూలసాల, భోజన్నపేట నుండి పెద్దపల్లి వచ్చే వారికి సులువుగా ఉంటుందని,
ఈ డబల్ రోడ్డు పనులు దశలవారీగా పూర్తి చేయడం జరుగుతుందని, ఇప్పటివరకు పెద్దపల్లి పట్టణంలో రూ. 40 కోట్ల పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పెద్దపల్లికి పర్యటనకు వచ్చినప్పుడు రూ. 15 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, అ పనులను త్వరలో ప్రారంభిస్తామని అలాగే ఉపముఖ్యమంత్రినిరూ. 50 కోట్ల అడగడంతో సానుకూలంగా ఆయన స్పందించారని, నిధులు రాగానే పెండింగ్ ఉన్న పనులు పూర్తి స్థాయిలో పమొదలుపెట్టడం జరుగుతుందని,
పెద్దపల్లి పట్టణంలో అమృత్ 2.0 పథకం కింద ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నటువంటి పెద్ద మసీద్ వద్ద, ఆర్డిఓ ఆఫీసులో 10 లక్షల లీటర్ల సామర్థ్యం గల నూతన వాటర్ ట్యాంక్, చందపల్లిలోని డబల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద 5 లక్షల లీటర్ల సామర్థ్యం గల నూతన వాటర్ ట్యాంకులు నిర్మించడం జరుగుతుందని,
పెద్దపల్లి పట్టణ ప్రజలకు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని, పెద్ద మసీద్ వద్ద నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ పనుల నేపథ్యంలో కొంత తాగునీటికి ఇబ్బందులు వస్తాయని, దయచేసి పెద్దపల్లి పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, మున్సిపల్ ఏఈ సతీష్, టౌన్ ప్లానింగ్ అధికారులు నరేష్, వినయ్, తదితరులుపాల్గొన్నారు.