calender_icon.png 11 October, 2025 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైకోర్టు తీర్పుపై గల్లీలో జోరుగా చర్చలు

11-10-2025 12:29:27 AM

  1. ఆశావాహుల్లో నిరాశలు.. రిజర్వేషన్లు కొనసాగుతాయా?

పాత రిజర్వేషన్లు వస్తాయా 

బోయినపల్లి : అక్టోబర్ 10 ( జయ క్రాంతి): ఎంపిటిసి జెడ్పిటిసి ఎన్నికల సందర్భంగా గురువారం హైకోర్టు ఇచ్చిన తీర్పుపై గల్లి గల్లి లో వాడవాడలో అభ్యర్థులు ప్రజలు చర్చించుకుంటూ ఉండగా ఆశావాహుల్లో మాత్రం నిరాశలు నెలకొన్నాయి. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు నాలుగు వారాలపాటు స్టే ఇవ్వడంతో రిజర్వేషన్లు మారుతాయి ఇదేవిధంగా కొనసాగుతాయా లేదా పాత పద్ధతిలో రిజర్వేషన్ల ద్వారా ఎన్నికల జరుగుతా యా అని ఆశావహులు రకరకాలుగా అనుమానాలతో రాజకీయంగా చర్చించుకుంటున్నారు.

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తొలి విడుతాగా జరిగే ఎంపీటీసీ జెడ్పిటిసి స్థానాలకు గురువారం ఎన్నికల అధికారులు షెడ్యూల్ ఇవ్వగా అక్కడక్కడ కొందరు అభ్యర్థులు జెడ్పిటిసి ఎంపిటిసి పదవులకు నామినేషన్ దాఖలు చేశారు. బీసీ రిజర్వేషన్లపై ఒక సామాజిక వర్గం వారు హైకోర్టులో అభ్యంతరం తెలుపగా హైకోర్టు పిటిషనర్ల వాదనతో పాటు ప్రభుత్వ వైపు నుంచి కూడా వాదనలు విని గురువారం సాయంత్రం నాలుగు వారాలపాటు స్టే విధించగా ఎన్నికల ప్రక్రియ రద్దు చేసినట్లు ఎన్నికల కమిషన్ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

దీంతో నిన్నటి వరకు చేసిన రిజర్వేషన్లతో ఆశావాహులు బరిలో ఉండాలని గ్రామాల్లో రాజకీయంగా తమ వర్గాలను అనుచరులను మచ్చిక చేసుకున్నారు. హైకోర్టు చేయడంతో వారు నిరాశకు గురై నాలుగు వారాల అనంతరం రిజర్వేషన్లు ఏ విధంగా ఉంటాయోనని భవిష్యత్తు రాజకీయాలను వారు ఊహించుకోలేకపోతున్నారు. ఏది ఏమైనా ఎన్నికలు వాయిదా పడడంతో పల్లెల్లో హైకోర్టు తీర్పుపై అన్ని వర్గాల ప్రజలు రాజకీయ నాయకులు తెలపండిన నేతలు రిజర్వేషన్లపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు.