calender_icon.png 7 September, 2025 | 10:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గియాసుద్దీన్ బాబుఖాన్ మరణం తీరని లోటు

05-09-2025 01:58:28 AM

ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ 

హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని సుప్రసిద్ధ కుటుంబాల్లో ఒకటైన బాబుఖాన్ కుటుంబంలో జన్మించిన గియాసుద్దీన్ బాబుఖాన్ మరణం హైదరాబాద్‌కు తీరని లోటని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశా రు. పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించడంలో ఆయన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.

సమాజా నికి కరుణ, ప్రేమ, సేవా తత్పరతను వారసత్వంగా వదిలి ఇటీవల మరణించిన గియాసోద్దీన్ బాబుఖాన్‌కు పలువురు ప్రముఖులు, ప్రజలు నివాళులు అర్పించారు. పరోప కారార్ధం ఇదం శరీరం అనే పెద్దల మాటలను అక్షరాల తన జీవితంలో ఆచరించిన మహాను భావుడు గియాసుద్దీన్ బాబుఖాన్ అని మోడ్రన్ ఇఖ్రా స్కూల్  కరస్పాండెంట్ అబ్దు ల్ బాసిత్ అన్నారు. 32 ఏళ్లలో లక్షలాది పేదలకు ఆర్థిక సహాయం చేశారని గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధికి మద్దతుగా డ్యామ్లు, వంతెనలు, పరిశ్ర మల నిర్మాణానికి కూడా సహకరించాలని కొనియాడారు.