05-09-2025 01:57:51 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్క రించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ (బెస్ట్ టీచర్) అవార్డులను గురు వారం ప్రకటించింది. మొత్తం 120 మంది తో జాబితాను ప్రకటించింది. పాఠశాల విద్యాశాఖ పరిధిలో 49 మంది ఉపాధ్యాయులకు బెస్ట్ టీచర్ అవార్డులు రాగా, యూనివర్సిటీ పరిధిలో 56 మంది, ఇంటర్మీడియట్ విద్యా పరిధిలో 11 మంది, సాంకేతిక విద్యాశాఖ పరిధిలో నలుగురికి వచ్చాయి.
మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో శుక్రవారం నిర్వహించే గురుపూజోత్స వం కార్యక్రమంలో సీఎం చేతుల మీదుగా వీరికి అవార్డులు ప్రదానం చేయనున్నారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలో నిజామాబాద్ జిల్లా నుంచి సీహెచ్ శంకర్ (జిల్లా పరిషత్ పాఠశాల బోర్గాన్), పీ నిర్మలా జ్యోతి (జిల్లాపరిషత్ బొమ్మల రామా రం, యాదాద్రి), మైస అర్వింద్ కుమార్ (జిల్లా పరిషత్ పొం కాల్ మామడ, నిర్మల్), ఏ విద్యాసాగర్ (జిల్లాపరిషత్ పోతిరెడ్డిపల్లి, సంగారెడ్డి), పనుగోటు ఛత్రు (జిల్లాపరిషత్ గరిడేపల్లి, సూ ర్యాపేట),
బీ రమేష్ (జిల్లాపరిషత్ మజీద్‌పల్లి, సిద్దిపేట సిద్దిపేట), డీ రామ్‌రెడ్డి (పీఎం శ్రీ నర్కుడ, రంగారెడ్డి), పీ రేఖ (జీజీహెచ్‌ఎస్, మెదక్), గడ్డం శశికళ (జిల్లా పరిషత్ పిప్పర్‌వాడ, ఆదిలాబాద్), ఎన్ తారాసింగ్ (టీజీఆర్ స్కూల్, మెదక్), అవుసుల భానుప్రకాశ్ (జిల్లాపరిషత్ లాల్‌గడీ, మలక్‌పేట్, మేడ్చల్ మల్క్‌జిగిరి), అబ్దుల్ ఖలిక్ (జీహెచ్‌ఎస్ పోలీస్‌లేన్, మహబూబ్‌నగర్), కొం డ్రతిరుపతి (జిల్లాపరిషత్ ఘనాపూర్, జయశంకర్ భూపాల్‌పల్లి),
యర్మల చిన బ్రహ్మయ్య (జిల్లాపరిషత్ దామరకుంట, సిద్దిపేట), రాఘవపురం గోపాలకృష్ణ (జిల్లాపరిషత్ కంజార్, నిజామాబాద్), పర్చల సత్య శ్రీదేవి (జిల్లాపరిషత్ కొమ్ముగూడెం, కొత్తగూడెం), వాకిట శ్రీదేవి (జిల్లా పరిషత్ అన్నారం, సంగారెడ్డి), బొనగిరి నరేందర్ (మస్కాపూర్, నిర్మల్), దాముక కమలా కర్ (కిస్తాపూర్, మంచిర్యాల), డాక్టర్ గొల్లపల్లి గణేశ్ (ఎంపీయూపీఎస్ తాళ్లధర్మారం, జగిత్యాల),
ఎం దేవన్న (జిల్లా పరిషత్ అప్పరాల, వనపర్తి), కడవేరు సత్యనారాయణ (ఎలబాక, కరీంనగర్), చెడిపాక రాములు (జీజీహెచ్ లస్కర్ బజార్, హనుమకొండ), డీ ఎల్లయ్య (జిల్లాపరిషత్ కాసర్లపహాడ్, సూర్యాపేట), పీ రమాదేవి (జిల్లాపరిషత్ బండా రవిరాల, రంగారెడ్డి), గీట్ల భరత్ రెడ్డి (జిలా ్లపరిషత్ మంథని, పెద్దపల్లి), రాదరపు సునీత (జిల్లాపరిషత్ మహబూబాబాద్), ముప్పాల కవిత (జిల్లా పరిషత్ స్కూల్, మేడ్చల్),
అవుసుల శైలు (ఎంపీపీఎస్ గాజులగూడెం, మెదక్), నూకల లింగయ్య (జిల్లా పరిషత్ జాడల్‌పేట్, జయశంకర్ భూపాలపల్లి), కొండా కవిత (టీజీఆర్ జూనియర్ కాలేజ్ సర్వైల్, యాదాద్రి), దంతాల సుధాకర్ రావు (ఎంపీపీఎస్ చెన్నూరు, ఖమ్మం), మూడెం స్వామి (పొందూర్తి, కామారెడ్డి), బొంపల్లి భవాని (గాంధారి, కామారెడ్డి), భూక్య గంగ య్య (ఎమైకుంట, ఆదిలాబాద్), కే బాలాజీ (దామర గిద్ద, రంగారెడ్డి),
పీ రేవతి (జంపల్లి, గద్వాల), ఎన్ విష్ణువర్ధన్ (నాగరాల, వనపర్తి), దారిపల్లి స్వరూప (అర్కపల్లి, మంచ్యిల), నీలం శ్రీదేవి (రామునితండా, యాదా ద్రి), కే నర్సింహ (బాలబద్రాయిపల్లి, నారాయణపేట), టీ రాజేశ్ కుమార్ (ఒడ్డెరగూడెం, ములుగు), హెచ్‌ఎన్ మణిమాల (టీజీఆర్ స్కూల్ బోరబండ, హైదరాబాద్), ఎం జగదీశ్వర్‌రెడ్డి (ఎంబీసీస్కూల్, మహబూబ్‌నగర్), జీ కళావతి (వీఎం హోమ్ స్కూల్ సరూర్‌నగర్, రంగారెడ్డి),
టీఎల్ నరేందర్ (బీకేబీ స్కూల్ అజామాబాద్, హైదరాబాద్), జీ శివకృష్ణ (పీఎంశ్రీ కందపల్లి, జగిత్యాల), జే ప్రవీణ్ (టీజీఎంఎస్ కాశీపేట, మంచిర్యాల), జీ సుమన చైతన్య (కేజీబీవీ తాండూర్). అలాగే ఇంటర్మీడియట్ విద్యాశాఖ పరిధిలో 11 మంది అధ్యాపకులు, రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీ పరిధిలో 56 మంది ప్రొఫెసర్లకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు.