05-09-2025 01:59:26 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): గణేష్ నిమజ్జనోత్సవాలను భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఘనంగా జరుపుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కే మురళీధర్‌రెడ్డి పిలుపునిచ్చారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం నాంపల్లి చిరాగలిలో ఏర్పాటు చేసిన గణేష మండపంలో ఆయన గణేశుడిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్ నిమజ్జనోత్సవాలను సనాతన ధర్మం ప్రకారం భక్తి, శ్రద్ధలతో భజన, కీర్తనలు ఆలపిస్తూ సామూహిక శోభాయాత్రలో ముందుకు సాగాలని కోరారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మురళీధర్‌రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు.