calender_icon.png 7 September, 2025 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎర్రవల్లిలో కీలక భేటీ

07-09-2025 01:30:50 AM

కవిత ఎపిసోడ్ నేపథ్యంలో ప్రాధాన్యత

హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, ఇతర ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన హరీశ్‌రావు ఫామ్‌హౌస్‌కు వెళ్లగా, కేటీఆర్ సహా పలువురు పార్టీ నాయకులు ఫామ్‌హౌస్‌లో ఉన్నారు. ఇటీవల అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు, కాళేశ్వరంపై దర్యాప్తును సీబీఐకి అప్పగించడం, ఎమ్మెల్సీ పదవికి, బీఆర్‌ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కవిత రాజీనామా చేయడం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా తాజాగా హరీశ్‌రావు, సంతోష్‌రావులపై కవిత తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కవిత ఆరోపణలు చేసిన తర్వాత మొదటిసారి హరీశ్‌రావు కేసీఆర్‌ను కలిశారు. కవిత వ్యవహారంలో పార్టీ అనుసరించాల్సిన తీరుపై చర్చించినట్టు తెలుస్తోంది. కాళేశ్వరం అంశంలోనూ సీబీఐని ఏవిధంగా ఎదుర్కొవాలనే విషయంపై సమాలోచనలు చేసినట్టు సమాచారం.

దీనికి తోడు త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ ఎన్నికలపై దృష్టి సారించడంపై కేటీఆర్, హరీశ్‌రావులకు కేసీఆర్ పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. దాదాపు నాలుగు గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. అయితే ఆదివారం కూడా సమావేశం కొనసాగనున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎలాంటి ప్రకటన చేస్తోం దోనన్న సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.