01-08-2025 01:18:11 AM
- తనిఖీల్లో బయటపడ్డ లోపాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 31 (విజయక్రాంతి): ఆన్‌లైన్ గ్రోసరీ డెలివరీ సంస్థల స్టోరేజ్, డిస్ట్రిబ్యూషన్ పాయింట్లపై జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో పలు లోపాలు, వెలుగులోకి వచ్చాయి. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన వస్తువుల నాణ్యత సరిగా ఉండటం లేదని, గడు వు ముగిసిన వస్తువులు వస్తున్నాయని జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదులు అందాయి.
దీనిపై స్పందించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, స్పెషల్ డ్రైవ్ నిర్వ హించాలని ఆదేశించారు. ఈ నేపథ్యం లో జెప్టో, అమెజాన్ ఫ్రెష్, ఇన్‌స్టా మా ర్ట్, బ్లింకిట్, బిగ్ బాస్కెట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జొమాటో వంటి సంస్థల స్టోర్ల పై అధికారులు దాడులు చేశారు.తనిఖీల్లో అనారోగ్యకరమైన వాతావర ణం.. కొన్నిచోట్ల ఈగలు ఉన్నట్లు, ఆహార పదార్థాలను అస్తవ్యస్తంగా నిల్వ చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఫుడ్, నాన్-ఫుడ్ ఉత్పత్తులను ఒకేచోట నిల్వ చేయడాన్ని గమనించారు.
స్టోర్లలో పనిచేస్తున్న సిబ్బందికి ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలపై అవగా హన లేదని తేలింది. అలాగే, వారికి మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు కూడా లేవని గుర్తిం చారు. మొత్తంగా 35 డెలివరీ పాయింట్లలో తనిఖీలు నిర్వహిం చిన అధికారు లు, అనుమానం ఉన్న 65 రకాల నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పం పారు. ఈ నమూనాల నివేదికలు 15 రోజుల్లో రానున్నాయి. నివేదికలో అవి అసురక్షితమైనవిగా తేలితే, ఆయా సంస్థలపై కేసులు నమోదు చేయనున్న ట్టు అధికారులు తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్ ఇంకా కొనసాగుతుందని పేర్కొన్నారు. నివేదికల ఆధారంగా జోనల్ కమిషనర్లు సంబంధిత సంస్థలకు నోటీసులు జారీ చేయనున్నారు.