calender_icon.png 21 November, 2025 | 10:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగ్లాదేశ్ ఘటనపై ప్రతి ఒక్కరు స్పందించాలి

17-08-2024 12:00:00 AM

ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు

కుమ్రంభీ ఆసిఫాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి): బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసాకాండపై ప్రతి భారతీయుడు స్పందించాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. శుక్రవారం కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, బెజ్జుర్ మండలాల్లో చేపట్టిన బంద్ విజయవంతం అయ్యింది. కాగజ్‌నగర్‌లో ఎమ్మెల్యే హరీశ్‌బాబుతోపాటు కుల సంఘాలు, బీజేపీ, హిందూ వాహిణి నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. మైనార్టీలుగా ఉన్న హిందువులపై అక్కడి ప్రజలు అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు. దాడులను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఆసాఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో బీజేపీ సీనియర్ నాయకుడు అరిగెల నాగేశ్వర్‌రావు, నాయకులు పాల్గొన్నారు.