calender_icon.png 1 December, 2025 | 7:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆత్మకూరు గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లోకి 36 మంది చేరిక

01-12-2025 07:06:08 PM

నాగిరెడ్డిపేట (విజయక్రాంతి): మండలంలోని ఆత్మకూరు గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నుండి కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో 36 మంది చేరారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరారని గ్రామ మాజీ సర్పంచ్ గడ్డం బాల్‌రెడ్డి తెలిపారు. పార్టీలో చేరినవారికి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గడ్డం బాల్‌రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారనన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుభాన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.