08-10-2025 12:56:00 AM
మంత్రి శ్రీధర్ బాబుకు వినతి
కరీంనగర్, అక్టోబరు 7 (విజయ క్రాంతి): కరీంనగర్ ప్రాంతంలో ఆటోనగర్కు స్థలం ఇప్పించాలని కోరుతూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును తెలంగాణ ఇంజనీరింగ్ వెల్ఫేర్ సొసైటీ ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ కరీంనగర్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. కరీంనగర్లో గతంలో ఇచ్చిన ఆటోనగర్లో స్థలం సరిపోవడంలేదని దీనికిగాను వేరే ప్రాంతం అయినా రుక్మాపూర్, బొమ్మకల్, ఎల్‌ఎండి లోని ఎస్సారెస్పీ ప్రాంతంలో స్థలం ఇవ్వాలని కోరారు.
దీంతో వెంటనే మంత్రి శ్రీధర్ బాబు స్పందించి రాష్ట్ర పరిశ్రమల డైరెక్టర్ కు, జిల్లా కలెక్టర్కు, వెంటనే స్థలం సేకరించాలని ఉత్తర్వులను పంపించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఇంజనీరింగ్ రీ బోర్ వెల్ఫేర్ సొసైటీ ఓనర్స్ అండ్ వర్కర్స్ అధ్యక్షులు డి వెంకటేశం, ఉపాధ్యక్షుడు మొహమ్మద్ ఖాజా, ప్రధాన కార్యదర్శి కోశాధికారి షేక్ సుభాని, దాసరి రాంబాబు, ఐలయ్య, మహమ్మద్ షకీల్, తదితరులుపాల్గొన్నారు.