calender_icon.png 8 October, 2025 | 5:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడ్లూరికి పొన్నం క్షమాపణ చెప్పాలి

08-10-2025 12:55:14 AM

  1. ‘దున్నపోతు’ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
  2. ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు భూమయ్య  

బిచ్కుంద, అక్టోబర్ 7 (విజయక్రాంతి): మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను దున్నపోతు అం టూ వ్యాఖ్యానించిన మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే అడ్లూరికి క్షమాపణ చెప్పాలని కామారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు భూమయ్య మాదిగ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “లక్ష్మణ్‌ను ఉద్దేశించి జంతువులతో పోల్చిన అహంకారపు మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ ఏశారు.

బీసీ మంత్రి అయి ఉండి సహచర మంత్రిని అగౌరవపర్చడం సిగ్గుతో తలవంచుకోవాల్సిన అంశం అన్నారు. మాదిగల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుని అడ్లూరి లక్ష్మణ్‌కు  క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే మాదిగల ఆగ్రానికి గురిగాక తప్పదు అని హెచ్చరించారు.