18-11-2025 01:07:42 AM
స్థల పరిశీలన చేసిన డిప్యూటీ సీఎం భట్టి
మేడ్చల్, నవంబర్ 17 (విజయక్రాంతి): డిసెంబర్‌లో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మి ట్ కోసం మేడ్చల్ జిల్లా దుండిగల్ మండలంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్ర మార్క సోమవారం స్థల పరిశీలన చేశారు. మండలంలోని 453, 454 సర్వే నంబర్లలో ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైజింగ్ విజన్ అభివృద్ధిలో భాగం గా ప్రభుత్వం తెలంగాణ ప్రజలనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను కూడా ఆహ్వానిస్తుందన్నారు.
హైదరాబాద్ అనుకూలమైన వాతావరణమని, అత్యంత నైపుణ్యంతో కూడిన మానవ వనరులు కలిగి ఉన్నందున పెట్టుబడిదారులను మరిం త ఆకర్షిస్తుందన్నారు. ఆయన సీఎం వెంట స్పెషల్ చీఫ్ సెక్రటరీ జెఎస్ రంజన్, కలెక్టర్ మనుచౌదరి, ఈవీ నరసింహారెడ్డి, అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి ఉన్నారు.