18-11-2025 01:07:05 AM
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): సౌదీ అరేబియాలో మక్కా నుంచి మదీనాకు బస్సులో వెళ్తున్న హైదరాబాద్ నగరానికి సంబంధించిన 45 మంది, ఒకరు కర్ణాటకకు చెందిన వారు మొత్తం 46 మంది ప్రయాణిస్తున్న బస్సు ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో అగ్నికి ఆహుతైందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ దుర్ఘటనలో 45 మంది సజీవ దహనం అయ్యారని, ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు.
ఇందులో ఎక్కువమంది సికింద్రా బాద్ పార్లమెంటు పరిధిలోని వారే ఉన్నారని పేర్కొన్నారు. ఢిల్లీలోని ఆయన అధికా రిక నివాసంలో సోమవారం మీడియా స మావేశంలో మాట్లాడుతూ.. దేవుడి దర్శనం దగ్గరకు వెళ్లిన సమయంలో ఇలాంటివి జరగడం కలిచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశా రు. ఈ ఘటన తెలిసిన వెంటనే సౌదీలో ఉన్న మన దౌత్యవేత్త సుహేల్ అజాజ్ ఖాన్ తో మాట్లాడినట్లు తెలిపారు.
అప్పటికే రి యాద్‌కు సంబంధించి ఎంబసీ, జెడ్డాలోని ఇండియన్ కాన్సులేట్ అధికారులు.. భారత ప్రభుత్వం తరపున పూ ర్తి స్థాయిలో సంఘటనకు సంబంధించిన విషయంలో పర్యవేక్షించాలని కేంద్రం ఆదేశించినట్లు తెలిపారు. అలాగే విదేశీ పర్య టనలో ఉన్న విదేశాంగ మంత్రి జైశంకర్‌తో తాను మాట్లాడినట్లు చెప్పారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు ఓ ఉన్నతస్థాయి బృందాన్ని పంపిస్తున్నట్లు పేర్కొన్నారు.
కేద్రం సెక్రటరీ ఎప్ప టికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నదని, పోస్టుమార్టం పూర్తవుతోందని, సోమవారం రాత్రి వరకు డెత్ సర్టిఫికెట్స్ ఇవ్వడం కూడా పూర్తవుతుందని చెప్పారు. సౌదీ ప్రభుత్వం కూడా ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టిందని, మృతదేహా లను గుర్తించే ప్రక్రియ వేగంగా సాగుతోందన్నారు. తాను హైదరాబాద్‌లోని మృతుల కుటుంబసభ్యులతో మాట్లాడానని, సౌదీలోనే అంత్యక్రియలు చేస్తే బాగుం టుందని వారు అనుకుంటున్నారని చెప్పా రు. బాధితు కుటుంబీకులకు కేంద్రం తరఫు న అండగా ఉంటామని చెప్పారు.