04-12-2025 07:48:16 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రెడ్డవేణి మధు మాతృమూర్తి రెడ్డవేణి వజ్రమ్మ అనారోగ్యంతో గురువారం ఉదయం పరమపదించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బావుపేటలోని వారి స్వగృహానికి వెళ్లి వజ్రమ్మ చిత్రపటం వద్ద పూలు వేసి నివాళులర్పించి రెడ్డవేణి మధు కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలత-మహేష్, నాయకులు కమల మనోహర్, పెంచాల ఆంజనేయులు, రాంగోపాల్, గుర్రాల చంద్రయ్యతో పాటు గ్రామస్థులు పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.