calender_icon.png 3 October, 2025 | 9:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాసిపేట 1 ఇంక్లైన్ లో నూతన పనులను ప్రారంభించిన జిఎం

03-10-2025 06:59:11 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): కాసిపేట 1 ఇంక్లైన్ లో నూతనంగా 4 ఎస్ 13, 3ఎస్ 13 అండర్ గ్రౌండ్లలో నూతన పనులకు అనుమతులు రావడంతో శుక్రవారం మందమర్రి జిఎం ఎన్. రాధాకృష్ణ పనులను ప్రారంభించారు. సంస్థ నిర్దేశించిన లక్షణం సాధించడానికి ఉద్యోగులు, అధికారులు కృషి చేయాలని కోరారు.  రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించి సంస్థకు గుర్తింపు తీసుకురావాలన్నారు. కాసిపేట గని ఎన్నో రికార్డులను సృష్టించిందని, మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి గని ఉద్యోగులు పనిచేయాలన్నారు. క్రమశిక్షణకు కాసిపేట ఉద్యోగులు ప్రతీకగా నిలిచారని కొనియాడారు. సరైన పనిముట్లను ఉపయోగించి నైపుణ్యతతో పనిచేయాలని సూచించారు. ఉద్యోగులలో గైర్హాజర్ శాతం ఎక్కువగా ఉందని వారు సక్రమంగా విధులను నిర్వర్తించి సంస్థకు, వారి కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు.