calender_icon.png 3 October, 2025 | 8:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంబిబిఎస్ సాధించిన నిరుపేద విద్యార్థికి సన్మానం

03-10-2025 06:55:48 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మండలం అంకుశం గ్రామపంచాయతీ పరిధిలోని లింగదరి గూడ గ్రామానికి చెందిన చునార్కర్ భువనేశ్వర్ నీట్ పరీక్షల్లో 380 మార్కులు సాధించి ఎంబీబీఎస్ చదివేందుకు అర్హత సాధించారు. భువనేశ్వర్ ను శుక్రవారం మండల సిపిఐ కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, చంద్రవెల్లి సింగిల్ విండో డైరెక్టర్ మూల శంకర్ గౌడ్, అంకుశం గ్రామ సిపిఐ శాఖ కార్యదర్శి బొంతల హనుమంతు లు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. నిరుపేద కుటుంబం లో పుట్టిన భువనేశ్వర్ తమ గ్రామం నుండి ఎంబిబిఎస్ సీటును సాధించడం తమకు గర్వంగా ఉందని వారు సంతోషం వ్యక్తం చేశారు.