03-10-2025 07:04:39 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అదేశాల మేరకు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణే ధ్యేయంగా ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా పోలీస్ శాఖ నిరంతర పని చేస్తుందని ఏఎస్పీ చిత్తారంజన్ తెలిపారు. గురువారం ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ లో నూతన ట్రాఫిక్ ఎస్సై చంద్ర శేఖర్ ను నియమించినట్లు సిఐ బాలాజీ వరప్రసాద్ వివరించారు. ట్రాఫిక్ ఎస్ఐతో పాటు ఇద్దరు హెడ్ కానిస్టేబుల్,ముగ్గురు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది నియంత్రణలో పని చేస్తారన్నారని, పట్టణంలోనీ ప్రధాన కూడళ్లు అయిన బస్టాండ్ , కేబీ చౌక్, ప్రభుత్వ ఆసుపత్రి చౌరస్తాతో పాటు గాంధీ , వివేకానంద చౌరస్తాలో ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ వ్యవహారాలు వంటివి నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టనున్నట్లు ఏఎస్పి పేర్కొన్నారు.